![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -246 లో.... ప్రేమ వర్షంలో తడుస్తుంటే నర్మద వచ్చి లోపలికి రమ్మంటుంది. నువ్వు నాతో మాట్లాడకు అక్క అని ప్రేమ అనగానే నర్మద షాక్ అవుతుంది. నేను ఆ వల్లి వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టాలనుకుంటే ఇలా చేసావని నర్మదని కోప్పడుతుంది ప్రేమ. నర్మద బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ప్రేమ వర్షంలో తడిసి లోపలికి వస్తుంది.
ప్రేమని చూసి ధీరజ్ తల తుడుచుకోమని టవల్ ఇస్తాడు. ప్రేమ సైలెంట్ గా ఉండడంతో ధీరజ్ ప్రేమ తల తూడుస్తాడు. జలుబు అవుతుందేమోనని వేడి నీళ్లు తీసుకొని వచ్చి ఆవిరి పట్టిస్తాడు ధీరజ్. అదంతా చూసి నేను ఎవరిని అని అడుగుతాడు. ప్రేమ అని ధీరజ్ అనగానే. అలా కాదు నాపై ఇంత కేర్ చూపిస్తున్నావు.. పైగా వరలక్ష్మి వ్రతం రోజు నాకు చీర కొనుక్కొని వచ్చావని ప్రేమ అంటుంది కానీ ధీరజ్ మాత్రం సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత నర్మద గదిలోకి వెళ్లగానే సాగర్ చిర్రుబుర్రులాడుతాడు. నా గురించి పట్టించుకోవా.. ఎప్పుడు ఫ్యామిలీ అంటావ్.. ముద్దు లేదు ముచ్చట లేదు అని సాగర్ అంటుంటే నర్మద మాత్రం చీర మార్చుకోవడానికి చీర సెట్ చేస్తుంటుంది.. నేను కడుతాను చీర అని నర్మద దగ్గరికి వస్తాడు సాగర్. మరుసటి రోజు ఆనందరావు ఇడ్లీ అమ్ముతుంటే తిరుపతి చూస్తాడు. నువ్వేంటి అన్నయ్య ఇడ్లీ అమ్ముతున్నావని అడుగుతాడు. మా ఆస్తులన్నీ పోయాయి కదా అందుకే అని అతను అంటాడు. సరే కానీ ఇడ్లీ తిను అని ఆనందరావు ఇవ్వగా.. నా చేతు కలశంలో ఉంది కదా.. నువ్వే తినిపించమని తిరుపతి అనగానే అతను తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |